మహాకుంభమేళాలో అగ్నిప్రమాదం

  • ప్రయాగ్‌రాజ్ సెక్టార్ 22లోని ఛట్‌నాగ్ ఘాట్ వద్ద మంటలు
  • కాలిపోయిన 15 గుడారాలు
  • ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదన్న అధికారులు
ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో మరోసారి అపశృతి చోటుచేసుకుంది. ప్రయాగ్‌రాజ్ సెక్టార్ 22లోని ఛట్‌నాగ్ ఘాట్ వద్ద ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో సుమారు 15 గుడారాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చింది.

ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. దాదాపు పదిరోజుల క్రితం రెండు గ్యాస్ సిలిండర్లు పేలి భారీగా మంటలు చెలరేగిన ఘటనలో 18 టెంట్లు కాలిపోయాయి. అంతేకాకుండా, నిన్న జరిగిన తొక్కిసలాటలో పలువురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు.

Kumbha Mela
Uttar Pradesh
Fire Accident

More Telugu News